
హైదరాబాద్ , 08 నవంబర్ (హి.స.)
హైదరాబాద్‌లోని బాచుపల్లి ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఇంజినీరింగ్ విద్యార్థి సూర్య ప్రాణాలు కోల్పోగా, మరో యువతి గాయపడింది. వివరాల్లోకి వెళితే.. బాచుపల్లిలోని ఫ్లైఓవర్‌పై బైక్‌పై ప్రయాణిస్తున్న సమయంలో వాహనం అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాద తీవ్రతకు విద్యార్థి సూర్య అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. అతడితో పాటు ప్రయాణిస్తున్న యువతికి గాయాలు కావడంతో స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ఆమెను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో బాచుపల్లి ఫ్లైఓవర్ పరిసరాల్లో విషాదకర వాతావరణం నెలకొంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. బైక్ వేగం ఎక్కువగా ఉండటమే ప్రమాదానికి కారణమా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్