
కొడంగల్ , 08 నవంబర్ (హి.స.)
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని హకీంపేట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు స్వయంగా పింఛను మంజూరు పత్రాలను అందజేస్తున్నారు. అర్హులైన పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, ఇతర వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా కొత్తగా పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి చేతుల మీదుగా మంజూరు పత్రాలు అందుకోవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పింఛన్ల ద్వారా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు కొంతమేర భరోసా లభించనుంది. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఈ ఆర్థిక సహాయం రోజువారీ అవసరాలను తీర్చుకోవడంలో ఉపయోగపడనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్