అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
అనకాపల్లి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. పెద్ద బొడ్డెపల్లి గురుకుల పాఠశాల సమీపంలో కారు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
Unidentified dead body


అమరావతి , 08 నవంబర్ (హి.స.)

అనకాపల్లి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. పెద్ద బొడ్డెపల్లి గురుకుల పాఠశాల సమీపంలో కారు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

గురుకుల పాఠశాల సమీపంలోని రహదారిపై కారు వెళ్తుండగా, ఆగి ఉన్న టిప్పర్ లారీని బలంగా ఢీకొట్టినట్లు తెలిసింది. ఢీకొన్న వేగానికి కారు తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘటనతో స్థానికంగా ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను బయటకు తీసి తదుపరి చర్యల కోసం ఏర్పాట్లు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతులు ఎవరనే విషయంతో పాటు వారు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నారనే కోణంలోనూ విచారణ చేపట్టే అవకాశం ఉంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande