
అమరావతి , 08 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. పలు జిల్లాల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని ముందంజలో నిలిచింది. జనసేన, బీజేపీ కూడా కొన్ని ప్రాంతాల్లో తమ ఉనికిని చాటుకోగా, వైఎస్సార్సీపీకి పరిమిత స్థానాలు దక్కాయి.
కడప జిల్లాలో మొత్తం 39 జడ్పీటీసీ స్థానాలకు గాను టీడీపీ 31, జనసేన 3, బీజేపీ 3, వైఎస్సార్సీపీ 2 స్థానాలు సాధించాయి. విజయనగరంలో 27 స్థానాల్లో టీడీపీ 20, జనసేన 2, వైఎస్సార్సీపీ 5 చోట్ల విజయం సాధించాయి. నెల్లూరులో 35 స్థానాలకు గాను టీడీపీ 30 స్థానాలు దక్కించుకుంది. శ్రీకాకుళంలో 30 స్థానాల్లో టీడీపీ 21, జనసేన 5 స్థానాలు పొందాయి.
పల్నాడులో 28 స్థానాలకు టీడీపీ 25, జనసేన 3 స్థానాలు సాధించాయి. నంద్యాలలో టీడీపీ 20 స్థానాలతో ముందుంది. కర్నూలులో 18, ప్రకాశంలో 22, మార్కాపురంలో 14 స్థానాలను టీడీపీ గెలుచుకుంది. కాకినాడలో టీడీపీ 11, జనసేన 7 స్థానాలు సాధించాయి.
ఇక పశ్చిమగోదావరి, తిరుపతి, శ్రీసత్యసాయి, కృష్ణా జిల్లాల్లో కొన్ని స్థానాల ఫలితాలు పెండింగ్లో ఉన్నాయి. మొత్తం మీద జిల్లాల వారీగా వెల్లడైన వివరాల్లో కూటమి పార్టీలకు ఆధిక్యం కనిపిస్తోంది. మిగిలిన ఫలితాలు వెలువడిన తర్వాత పూర్తి స్థాయి రాజకీయ చిత్రం స్పష్టమయ్యే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్