కీసర పోలీస్ స్టేషన్ పై ఏసీబీ దాడి.. అవినీతి ఎస్సై అరెస్ట్
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్లో మరో అవినీతి అక్రమ లంచం వ్యవహారం బయటపడింది. చార్జ్షీట్ వేసేందుకు రూ.2 లక్షలు డిమాండ్ చేసిన ఎస్ఐ శ్రీనివాస్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
Acb


హైదరాబాద్, 09 నవంబర్ (హి.స.)

మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్లో మరో అవినీతి అక్రమ లంచం వ్యవహారం బయటపడింది. చార్జ్షీట్ వేసేందుకు రూ.2 లక్షలు డిమాండ్ చేసిన ఎస్ఐ శ్రీనివాస్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నాగారం పరిధిలోని శిల్పానగర్లో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.

కీసర స్టేషన్లో నమోదైన భూ మోసం, 498ఏ కేసుల్లో ఒక వ్యక్తి నిందితుడిగా ఉన్నాడు. రెండు కేసుల్లో చార్జ్షీట్లు వేయాలని ఆయన ఎస్ఐని కోరాడు. అయితే కేసుల్లో చార్జి షీట్లు త్వరగా వేయాలంటే రూ.2 లక్షలు ఇవ్వాలని ఎస్ఐ డిమాండ్ చేసినట్టు సమాచారం.

ఎస్ఐ డిమాండ్తో విసిగిపోయిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. పథకం ప్రకారం సోమవారం ఉదయం కీసరలోని శిల్పా లేఅవుట్కు వచ్చి రూ.2 లక్షలు ఇవ్వాలని ఎస్ఐ బాధితుడికి చెప్పాడు. బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి శ్రీనివాస్ను పట్టుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande