నేటితో ముగియనున్న సీఎం కొడంగల్ పర్యటన.. సాయంత్రం బహిరంగ సభ
కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న మూడు రోజుల పర్యటన సోమవారంతో ముగియనుంది.
Cm


హైదరాబాద్, 09 నవంబర్ (హి.స.)

కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న మూడు రోజుల పర్యటన సోమవారంతో ముగియనుంది.

చివరి రోజున ఆయన పలు కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. పరిశ్రమలు, రవాణా మౌలిక వసతుల విస్తరణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. లగచర్లలో ఆయిల్ పామ్ పరిశ్రమకు శంకుస్థాపన, కోస్గి మండలం నాచారం వద్ద రేడియల్ రోడ్డు-2 పనుల ప్రారంభం ఈ పర్యటనలో కీలకంగా నిలవనున్నాయి.

సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు దుద్యాల మండలం హకీంపేటలో జరిగే భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడనున్నారు. కొడంగల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, పారిశ్రామిక ప్రణాళికలు, మౌలిక వసతుల గురించి ఆయన వివరించే అవకాశం ఉంది.

షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 4.15 గంటలకు కొడంగల్లోని తన నివాసం నుంచి సీఎం రోడ్డు మార్గంలో హకీంపేటకు బయలుదేరతారు. సాయంత్రం 4.30 నుంచి 5 గంటల మధ్య లగచర్లలో పారిశ్రామిక కారిడార్లో రానున్న ఆయిల్ పామ్ పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత నాచారం వద్ద రేడియల్ రోడ్డు-2 పనులను ప్రారంభించి, పలు అభివృద్ధి పనుల శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande