రాష్ట్రంలో జనగణన నిర్వహణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ
రాష్ట్రవ్యాప్తంగా జనగణన ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Telangana govt


హైదరాబాద్ , 09 నవంబర్ (హి.స.)

రాష్ట్రవ్యాప్తంగా జనగణన ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జనాభా వివరాలను సేకరించడంతో పాటు ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయడం ఈ ప్రక్రియలో కీలకంగా ఉండనుంది.

ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు రాష్ట్రంలో జనగణన నిర్వహించనున్నారు. ఈ సమయంలో సంబంధిత అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల నుంచి అవసరమైన వివరాలను సేకరిస్తారు. అంతకుముందు జనవరి 10 నుంచి 24 వరకు ప్రజలకు స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్) చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఈ విధానంలో ప్రజలు తమ కుటుంబానికి సంబంధించిన వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చు.

అనంతరం సేకరించిన సమాచారాన్ని పరిశీలించి, అవసరమైన మార్పులు, సవరణలు చేసేందుకు మార్చి 1 నుంచి 5 వరకు రివిజనల్ రౌండ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు జనగణన ఏర్పాట్లను అధికారులు చేపట్టాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులో ప్రక్రియను పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande