వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సిబ్బంది, విద్యార్థుల ఆందోళన
హైదరాబాద్లోని రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సిబ్బంది, విద్యార్థులు ఆందోళనకు దిగారు.
వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సిబ్బంది, విద్యార్థుల ఆందోళన


హైదరాబాద్ , 09 నవంబర్ (హి.స.)

హైదరాబాద్లోని రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సిబ్బంది, విద్యార్థులు ఆందోళనకు దిగారు. విశ్వవిద్యాలయం వీసీ జానయ్యపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ వ్యవహారంలో బాధిత మహిళా ప్రొఫెసర్కు న్యాయం చేయాలని వారు కోరారు.

వీసీపై మహిళా ప్రొఫెసర్ చేసిన ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఈ నిరసన చేపట్టారు. ఆరోపణలపై ఎలాంటి జాప్యం లేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులు పనిచేసే చోట గౌరవప్రదమైన వాతావరణం ఉండాలని, వారి భద్రతకు యాజమాన్యం పూర్తి బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు.

మహిళా ఉద్యోగినులు ఎలాంటి ఒత్తిళ్లు, వేధింపులు లేకుండా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితురాలికి న్యాయం జరగడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠమైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. విశ్వవిద్యాలయంలో మహిళల ఆత్మగౌరవం, రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని విద్యార్థులు, సిబ్బంది విజ్ఞప్తి చేశారు. ఈ నిరసనతో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande