
జగిత్యాల, 09 నవంబర్ (హి.స.)
జగిత్యాల కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల నుంచి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణికి వస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి మొత్తం 32 ఫిర్యాదులు, వినతులు వచ్చినట్టు చెప్పారు.
ప్రతి ఫిర్యాదును అధికారులు బాధ్యతగా తీసుకుని సమగ్ర విచారణ చేసి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. అర్జీలను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని, పరిష్కారంలో నిర్లక్ష్యం చేయకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. వాటిని సంబంధిత శాఖల అధికారులు ప్రాధాన్యతతో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు సకాలంలో అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..