కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్
కోస్గిలో చనిపోయిన కార్యకర్తల అంత్యక్రియలకు వెళ్తున్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిగి దగ్గర ఆయనను ఆపడంతో పోలీసులకు, ఆయనకు మధ్య కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.
MLA arrest


హైదరాబాద్, 09 నవంబర్ (హి.స.)

కోస్గిలో చనిపోయిన కార్యకర్తల అంత్యక్రియలకు వెళ్తున్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిగి దగ్గర ఆయనను ఆపడంతో పోలీసులకు, ఆయనకు మధ్య కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.

సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉన్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఆయనను అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. అంత్యక్రియలకు వెళ్లకుండా అడ్డుకోవడం ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారితీసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande