విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. ఆటోమొబైల్ షాప్లో చెలరేగిన మంటలు
విజయనగరం జిల్లాలోని రాజాం పట్టణంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Image of the Fire Destroying Commercial Establishments in Silapathar During Diwali Celebrations.


విజయనగరం , 09 నవంబర్ (హి.స.)

విజయనగరం జిల్లాలోని రాజాం పట్టణంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ఆటోమొబైల్ షాప్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. కొద్దిసేపటికే మంటలు వేగంగా వ్యాపించి పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

అగ్నిప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. తీవ్రంగా శ్రమించి మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అడ్డుకున్నారు. చివరకు మంటలను పూర్తిగా అదుపు చేశారు.

అయితే ఈ ప్రమాదంలో ఆటోమొబైల్ షాపులోని సామగ్రి, ఇతర వస్తువులు అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం గురించి ఎలాంటి సమాచారం వెలువడలేదు. అసలు అగ్నిప్రమాదానికి కారణం ఏమిటన్నది తెలియాల్సి ఉంది. ఘటనపై సంబంధిత అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande