కూకట్పల్లిలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
కూకట్పల్లి ఆస్బెస్టాస్ కాలనీలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Fire accident


హైదరాబాద్, 09 నవంబర్ (హి.స.)

కూకట్పల్లి ఆస్బెస్టాస్ కాలనీలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పేపర్ టీ కప్పులు, ప్లేట్లు తయారు చేసే కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించి పక్కనే ఉన్న దుకాణ సముదాయాలకు కూడా అంటుకున్నాయి.

విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని 4 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదు. అయితే భారీగా ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande