మహిళలను లక్ష్యాధికారులుగా చేసేందుకు అడుగులు.. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు మండల కేంద్రంలో ఆదివారం రాత్రి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇళ్లలో జరిగిన దీపావళి వేడుకలకు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Shabbir Ali


కామారెడ్డి, 09 నవంబర్ (హి.స.) కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు మండల కేంద్రంలో ఆదివారం రాత్రి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇళ్లలో జరిగిన దీపావళి వేడుకలకు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పటేల్ చౌక్ వద్ద జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆయన, లబ్ధిదారులకు రావాల్సిన ఫైనల్ బిల్ డబ్బులు ఇప్పించే బాధ్యత తనదేనని, దీనిపై ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దని భరోసా ఇచ్చారు.

సీఎం రేవంత్ ప్రభుత్వంలోనే పేదలకు న్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. ఎన్నో ఏళ్లుగా పేదలు కంటున్న సొంతింటి కలను నెరవేర్చింది తమ ప్రభుత్వమేనని చెప్పారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాకుండా, వారిని ఆర్థికంగా లక్షాధికారులుగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande