
కామారెడ్డి, 09 నవంబర్ (హి.స.)
కామారెడ్డి జిల్లాలో హార్వెస్టర్ మిషన్ల లీజు పేరుతో జరిగిన కిడ్నాప్ వ్యవహారాన్ని పోలీసులు ఛేదించారు.
బీబీపేట మండలం కోనాపూర్కు చెందిన మహేశ్ను నరసింగరావు, నగేశ్, శ్రీకాంత్ అనే ముగ్గురు నిందితులు మిషన్లు లీజుకు ఇస్తామని నమ్మించారు. లీజు విషయం మాట్లాడాలంటూ తమ వద్దకు పిలిచారు.
నిందితుల చెర నుంచి తప్పించుకున్న బాధితుడు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి ముగ్గురినీ అరెస్ట్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు