
ఖమ్మం, 09 నవంబర్ (హి.స.)
ఖమ్మం జిల్లాలో కోడిపందాలు నిర్వహిస్తున్న స్థావరాలపై పోలీసులు మెరుపు దాడి చేశారు. వేంసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చౌడవరం గ్రామ తండా దగ్గర రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో పందాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఆదివారం సాయంత్రం సమయంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పందెం కాస్తూ పట్టుబడిన 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టయిన వారి నుంచి 13 మోటార్ సైకిళ్లు, 3 కోడిపుంజులు, 6 సెల్ఫోన్లు, రూ.3,100 నగదు స్వాధీనం చేసుకుని నిందితులను వేంసూరు పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వేంసూరు పోలీసులు తెలిపారు. కోడిపందాలు, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..