ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మార్నింగ్ వాక్
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం వెంకటేశ్వర్లబావి గ్రామంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రజలతో మార్నింగ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు.
Mla


నాగర్ కర్నూల్, 09 నవంబర్ (హి.స.)

నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం వెంకటేశ్వర్లబావి గ్రామంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రజలతో మార్నింగ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామస్తులతో కలిసి వీధుల్లో నడుస్తూ, వారితో ఆత్మీయంగా మాట్లాడుతూ వారి యొక్క ఇబ్బందులు, స్థానిక సమస్యలు ఏమున్నాయో స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ప్రజలతో నేరుగా కలిసి వారి సమస్యలు తెలుసుకోవడమే ఈ మార్నింగ్ వాక్ కార్యక్రమం ఉద్దేశమని వంశీకృష్ణ చెప్పారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande