మక్తల్ పట్టణ రూపురేఖలు మారేలా సమగ్ర అభివృద్ధి.. మంత్రి వాకిటి
నారాయణపేట జిల్లా లోని మక్తల్లో సోమవారం ఉదయం పర్యటించిన రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
Minister


నారాయణపేట, 09 నవంబర్ (హి.స.) నారాయణపేట జిల్లా లోని

మక్తల్లో సోమవారం ఉదయం పర్యటించిన రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఖేలో ఇండియా పోటీల కోసం స్టేడియంలో జరుగుతున్న ఖో ఖో క్రీడాకారుల ఎంపిక, శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. డిసెంబర్ 11 నుంచి మొదలుకానున్న పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు స్వర్ణ పతకాలు సాధించేలా కష్టపడాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఖో ఖోలో తెలంగాణ జట్టు బంగారు పతకం తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. శిక్షణ ఏర్పాట్లను చూసి సంతృప్తి చెందిన మంత్రి, క్రీడాకారులతో పాటు జిల్లా క్రీడా శాఖ అధికారి వెంకటేష్తో మాట్లాడి శిక్షణ వివరాలు తెలుసుకున్నారు.

మక్తల్ మున్సిపాలిటీ లో రూ.2.5 కోట్లతో జరుగుతున్న రహదారి, వంతెన పనులను కూడా మంత్రి పరిశీలించారు. పనులు ఎంత వరకు వచ్చాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ వద్దని, గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.

మక్తల్ పట్టణం రూపురేఖలు మారేలా సమగ్ర అభివృద్ధి చేస్తామని మంత్రి చెప్పారు. అభివృద్ధిలో ఎక్కడా రాజీ పడకుండా, ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande