
నాగర్ కర్నూల్, 09 నవంబర్ (హి.స.)
నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం వెల్దూరు గ్రామ శివారులో జరుగుతున్న పేకాటపై పోలీసులు మెరుపుదాడి చేశారు.
డిండి రిజర్వాయర్ చెక్ డ్యామ్ దగ్గర నిర్మానుష్య ప్రాంతంలో కొంతకాలంగా రాత్రిపూట పెద్ద మొత్తంలో నగదు పెట్టి పేకాట ఆడుతున్నట్టు పోలీసులకు అందిన సమాచారం మేరకు స్థానిక ఇన్స్పెక్టర్ సిబ్బందితో కలిసి రాత్రి 11 గంటలకు ఆ స్థావరాన్ని చుట్టుముట్టారు.
పోలీసులను చూసి పేకాట ఆడుతున్న వారు పారిపోయేందుకు ప్రయత్నించారు. అయినా ఆరుగురిని పట్టుకున్నారు. మరో ఆరుగురు తమ బైక్లను అక్కడే వదిలేసి పక్కనే ఉన్న పొలాల్లోకి పారిపోయారు. పట్టుబడిన వారి నుంచి రూ.60,430 నగదు, ఆరు సెల్ఫోన్లు, ప్లేయింగ్ కార్డులు, నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిపై గేమింగ్ యాక్ట్ కింద కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు