అర్నాబ్ తుపాను దెబ్బకు ధ్వంసమైన ఉప్పాడ బీచ్ రోడ్డు.. విద్యార్థులకు తప్పని ప్రయాణ కష్టాలు
అర్నాబ్ తుపాను ప్రభావం నుంచి కాకినాడ జిల్లా తీర ప్రాంత ప్రజలు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. తుపాను సమయంలో కురిసిన భారీ వర్షాలు, సముద్రపు అలల ఉద్ధృతికి ఉప్పాడ బీచ్ రోడ్డు తీవ్రంగా దెబ్బతింది.
Rain


అమరావతి , 09 నవంబర్ (హి.స.)

అర్నాబ్ తుపాను ప్రభావం నుంచి కాకినాడ జిల్లా తీర ప్రాంత ప్రజలు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. తుపాను సమయంలో కురిసిన భారీ వర్షాలు, సముద్రపు అలల ఉద్ధృతికి ఉప్పాడ బీచ్ రోడ్డు తీవ్రంగా దెబ్బతింది. రహదారి చాలా వరకు ధ్వంసం కావడంతో స్థానికులకు రాకపోకలు కష్టంగా మారాయి. ముఖ్యంగా ఉప్పాడ, ములపేట పరిసర గ్రామాల నుంచి కాకినాడకు విద్య, ఇతర అవసరాల కోసం వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

బీచ్ రోడ్డు మీదుగా బస్సులు, ఆటోల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాల్సి వస్తోంది. పిఠాపురం మీదుగా కాకినాడ చేరుకోవడానికి అదనంగా సుమారు 15 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. మరోవైపు తుని–అద్దరిపేట మార్గంలో నడిచే బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరగడంతో నిలబడటానికి కూడా స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారు.

ఈ సమస్యపై స్పందించాలని కోరుతూ విద్యార్థులు కాకినాడ కలెక్టరేట్కు చేరుకుని అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ధ్వంసమైన రహదారికి తక్షణ మరమ్మతులు చేపట్టాలని, రవాణా సౌకర్యాలను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ రోజువారీ ప్రయాణ కష్టాలకు త్వరగా పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande