
భద్రాద్రి కొత్తగూడెం, 09 నవంబర్ (హి.స.)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా విషాదాన్ని నింపింది. పాల్వంచ సమీపంలో రెండు బైకులు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ఢీలో వాటిపై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మృతులను భూక్యా సోమ్లా, రంజిత్గా గుర్తించారు. గాయపడిన మహిళను స్థానికులు వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..