ఈ నెల 11 నుంచి పదో తరగతి పరీక్ష ఫీజుల స్వీకరణ
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రభుత్వ పరీక్షల విభాగం కీలక సమాచారం అందించింది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల నుంచి ఈ నెల 11వ తేదీ నుంచి ఫీజులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది.
Karnataka-SSLC-PUC-Exam-System-Two-Main-Exams-2027


హైదరాబాద్ , 09 నవంబర్ (హి.స.)

పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రభుత్వ పరీక్షల విభాగం కీలక సమాచారం అందించింది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల నుంచి ఈ నెల 11వ తేదీ నుంచి ఫీజులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 25వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది.

గడువు దాటిన విద్యార్థులు అదనపు రుసుముతో ఫీజు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసులురెడ్డి వెల్లడించారు. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 2 వరకు రూ.50 ఆలస్య రుసుముతో, డిసెంబర్ 3 నుంచి 9 వరకు రూ.200 అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి అవకాశంగా డిసెంబర్ 10 నుంచి 15వ తేదీ వరకు రూ.500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించేందుకు అనుమతించారు.

ఫీజుల విషయంలో అభ్యర్థుల సబ్జెక్టుల సంఖ్యను బట్టి రుసుములు నిర్ణయించారు. మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు రాసే రెగ్యులర్ విద్యార్థులు రూ.125, మూడు సబ్జెక్టుల వరకు పరీక్ష రాసేవారు రూ.110 చెల్లించాలి. వృత్తివిద్య కోర్సుల విద్యార్థులు అదనంగా రూ.60 చెల్లించాల్సి ఉంటుంది. వయోపరిమితి నిబంధనల నుంచి మినహాయింపు కోరే అభ్యర్థులు రూ.300 అదనంగా చెల్లించాలి. విద్యార్థులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా గడువులోగా ఫీజులు చెల్లించాలని అధికారులు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande