
అమరావతి , 09 నవంబర్ (హి.స.)
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో కొండపై రద్దీ కొనసాగుతోంది. ముఖ్యంగా దర్శన టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులు స్వామివారి సర్వదర్శనం కోసం సుమారు 15 గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. భక్తుల రాక పెరగడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. అక్కడి నుంచి క్యూలైన్లు నారాయణగిరి షెడ్ల వరకు విస్తరించాయి. దీంతో భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటూ తమ వంతు దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు.టంతో కొండపై రద్దీ కొనసాగుతోంది. ముఖ్యంగా దర్శన టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులు స్వామివారి సర్వదర్శనం కోసం సుమారు 15 గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. భక్తుల రాక పెరగడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. అక్కడి నుంచి క్యూలైన్లు నారాయణగిరి షెడ్ల వరకు విస్తరించాయి. దీంతో భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటూ తమ వంతు దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు.
మరోవైపు, తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లు కొనసాగిస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పిస్తోంది. ఇక నిన్న ఒక్కరోజే 78,228 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.01 కోట్లు సమకూరింది. అలాగే 25,564 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో తిరుమలకు వెళ్లే వారు దర్శన సమయాన్ని దృష్టిలో పెట్టుకుని తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్