నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ .నియోజకవర్గం లో. భారీ కుంభకోణం
ఆళ్లగడ్డ,, 24 ఫిబ్రవరి (హి.స.) :నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వెలుగు చూసిన భారీ కుంభకోణంపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఉద్యోగాల పేరుతో అమాయక నిరుద్యోగులను నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేసిన ''వెల్త్ అండ్ హెల్త్ సొల్యూషన్ స్కీమ్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ .నియోజకవర్గం లో. భారీ కుంభకోణం


ఆళ్లగడ్డ,, 24 ఫిబ్రవరి (హి.స.)

:నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వెలుగు చూసిన భారీ కుంభకోణంపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఉద్యోగాల పేరుతో అమాయక నిరుద్యోగులను నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేసిన 'వెల్త్ అండ్ హెల్త్ సొల్యూషన్ స్కీమ్' సంస్థ నిర్వాహకులపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.

ఆళ్లగడ్డ కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన ఈ సంస్థ, నిరుద్యోగులకు ఆకర్షణీయమైన జీతాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికింది. సుమారు రూ. 35 కోట్ల మేర బాధితుల నుంచి వసూలు చేసి, ఆపై బోర్డు తిప్పేసింది. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande