అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి, 25 ఫిబ్రవరి (హి.స.) కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని కొండాపూర్ గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామంలోని ఇందిరమ్మ ఇల్లు, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను
Kamareddy collector


కామారెడ్డి, 25 ఫిబ్రవరి (హి.స.) కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని కొండాపూర్ గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామంలోని ఇందిరమ్మ ఇల్లు, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలని, ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని, అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులను కలిసి మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందుతున్న వైద్యసేవలను, మందులను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కావలసిన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించరాదని ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. రోగులతో మాట్లాడారు. అక్కడ నుంచి నేరుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లి పాఠశాలలో లైబ్రరీ ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ల్యాబ్ లోని విద్యార్థులతో ముచ్చటించి విద్యార్థులతో బోర్డుపై రివిజన్స్ చేయించారు.

పదవ తరగతి విద్యార్థులకు విలువైన సలహాలు సూచనలు

పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో విలువైన సలహాలు సూచనలు అందించారు. అనంతరం గ్రామంలో పర్యటించి అక్కడ ఉన్న సమస్యలను పరిశీలించి మురికి కాలువల పరిశుభ్రత, ఇంటింటికి చెత్త సేకరణ చేపట్టి గ్రామంలో దోమలు ప్రబలకుండా పరిశుభ్రంగా ఉండాలన్నారు. అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. గ్రామ ప్రజలు,రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రంలో టాయిలెట్స్ నిర్మాణం పూర్తి చేయాలని, కొండాపూర్, గుండారం, ఆర్గోండ గ్రామాల్లో గల ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలను ఎర్రపహడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బదులుగా రాజంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మార్చాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ను గ్రామస్తులు కోరారు. ప్రాథమిక పాఠశాల టాయిలెట్ నిర్మాణం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ను కోరిన వెంటనే ఆదేశాలు జారీ చేశారు. జొన్న పంట సేకరణ పరిమితి పెంచాలని ఎకరానికి 14 క్వింటాల్ల నుంచి 22 క్వింటాల వరకు పెంచాలని కలెక్టర్ కు రైతులు విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవీందర్ గౌడ్, జిల్లా విద్యాధికారి రాజు, తహసీల్దార్ జానకి, ఎంపీడీవో బాలకృష్ణ, సర్పంచ్ కృష్ణ, పంచాయతీ కార్యదర్శి శ్రీజ, వివిధ శాఖల అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande