కాచిగూడ రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించిన   దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ
కాచిగూడ – సీతాఫల్ మండి మరియు చర్లపల్లి - యాదాద్రి సెక్షన్ల మధ్య రియర్ విండో తనిఖీని కూడా నిర్వహించారు.
కాచిగూడ రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించిన   దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ


హైదరాబాద్, 25 ఫిబ్రవరి (హి.స.)

దక్షిణ మధ్య రైల్వే జనరల్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఈరోజు అనగా ఫిబ్రవరి 24 ,, 2026 న కాచిగూడ రైల్వే స్టేషన్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు మరియు కాచిగూడ - సీతాఫల్మండి మరియు చర్లపల్లి - యాదాద్రి సెక్షన్ల మధ్య రియర్ విండో తనిఖీని కూడా నిర్వహించారు.

జనరల్ మేనేజర్ కాచిగూడ రైల్వే స్టేషన్‌తో తనిఖీని ప్రారంభించారు. ఈ తనిఖీ సమయంలో ఆయనతో పాటు హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ సంతోష్ కుమార్ వర్మ మరియు ఇతర సీనియర్ రైల్వే అధికారులు పాల్గొన్నారు. ఈ తనిఖీ లో ప్లాట్‌ఫామ్ నెం.1 పై ప్రయాణీకుల సౌకర్యాలను, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, యార్డ్ మరియు పిట్ లైన్ కార్యకలాపాలను ఆయన పరిశీలించారు. ఆయన సిబ్బంది మరియు అధికారులతో మాట్లాడుతూ రైలు కార్యకలాపాల నిర్వహణలో భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా అనుసరించాలని ఆదేశించారు. జనరల్ మేనేజర్ గోల్నాక వైపు ఉన్న స్టేషన్ ఆవరణను కూడా తనిఖీ చేస్తూ అక్కడ స్టేషన్ అభివృద్ధి ప్రణాళికలను పరిశీలించారు.

తరువాత, శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సీతాఫల్మండి – లాలాగూడ - యాదాద్రి సెక్షన్లో రియర్ విండో తనిఖీని సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ గోపాలకృష్ణన్ ఆర్ మరియు ఇతర సీనియర్ రైల్వే అధికారులతో కలిసి చేపట్టారు. ఈ సంధర్భంగా సీతాఫల్మండి–లాలాగూడ కార్డ్ లైన్ సెక్షన్‌లో పురోగతిలోనున్న పనులను ఆయన పరిశీలించారు . ఈ ముఖ్యమైన సెక్షన్ కాజీపేట నుండి కాచిగూడ / బెంగళూరు వైపు వెళ్లే రైళ్లు మల్కాజ్‌గిరి లేదా సికింద్రాబాద్ స్టేషన్‌ కు వెళ్ళకుండా నేరుగా వెళ్లేందుకు సహాయపడుతుంది. తదుపరి చర్లపల్లి-యాదాద్రి మధ్య నిర్వహించిన రియర్ విండో తనిఖీలో సిగ్నలింగ్ వ్యవస్థ, ట్రాక్, కర్వ్లు , గ్రేడియన్ట్లు మరియు వంతెనలు మొదలైన వాటిని పరిశీలిస్తూ సెక్షన్ భద్రతను పెంపొందించడానికి చేపట్టిన సమగ్ర చర్యలపై దృష్టి సారించారు .

జనరల్ మేనేజర్ యాదాద్రి రైల్వే స్టేషన్‌లో రూ.24.45 కోట్లతో చేపట్టిన పునరాభివృద్ధి పనులను పరిశీలించారు. రాబోయే స్టేషన్ పునరాభివృద్ధి ప్రణాళికలపై అధికారులతో చర్చించారు మరియు లక్ష్యం ప్రకారం ప్రాజెక్టును పూర్తి చేయడానికి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande