
హైదరాబాద్, 25 ఫిబ్రవరి (హి.స.)
రాష్ట్రంలో మరికొంతమంది పోలీసులు
ఎదుట సరెండర్ అయితే, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ కాగార్' పూర్తవుతుందని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు (Ramchander Rao) అన్నారు. ఈరోజు రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎర్రజెండా ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు. అంతమైపోయిన కమ్యూనిజన్ని రేవంత్ రెడ్డి (Revanth Reddy), కెసిఆర్ మళ్ళీ బతికించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
విద్యార్థులను అర్బన్ నక్సలైట్లు గా
(Urban Naxalites) మార్చి వారి భవిష్యత్తును పాడు చేయవద్దని ఆయన హితవు పలికారు. రాబోయే రోజుల్లో అర్బన్ నక్సలిజాన్ని అంతం చేస్తామని తెలిపారు. యువతను తప్పుదోవ పట్టిస్తున్న రాహుల్ గాంధీ దేశానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు