రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత : ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్గొండ, 25 ఫిబ్రవరి (హి.స.) రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్
Nalgonda SP


నల్గొండ, 25 ఫిబ్రవరి (హి.స.)

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా మాడుగులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా మాడుగుల పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రైవర్లకు ప్రత్యేకంగా ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని మాట్లాడారు. డ్రైవర్కు కంటి చూపు సరిగ్గా లేకపోతే అది ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతుందన్నారు. ప్రతి డ్రైవర్ నిర్దిష్ట కాల వ్యవధిలో ఒకసారి అయినా కంటి పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ఇది తన భద్రతతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడే చర్య అని పేర్కొన్నారు.

అలాగే రోడ్డు ప్రమాదాలు నివారణ గురించి మాట్లాడుతూ ముఖ్యంగా రోడ్డు భద్రత నియమాలను పైన అవగాహన లోపం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. నిర్లక్ష్య డ్రైవింగ్, అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం లేకపోవడం వంటి కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తేనే ప్రమాదాలను తగ్గించవచ్చని అన్నారు. మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపడం ప్రమాదకరమన్నారు. అలాగే రోడ్డు ప్రమాదంలో ప్రమాదానికి గురైన వ్యక్తులను ప్రాథమిక చికిత్స నిమిత్తం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డాక్టర్లు సీపీఆర్ పైన అవగాహనా కల్పించారు. సురక్షిత ప్రయాణం – సంతోషకర గమ్యం అనే లక్ష్యంతో అందరూ కలిసి పని చేయాలని ఎస్పీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

అనంతరం రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ వాహనాలు నడుపుతూ ప్రమాదాల నివారణకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande