హనుమకొండ జిల్లా.కాజీపేట లో నిర్మిస్తున్న కోచ్ ఫ్యాక్టరీ పూర్తి
కాజీపేట , 24 ఫిబ్రవరి (హి.స.) , హనుమకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్యపురం సమీపంలో నిర్మిస్తున్న కోచ్ఫ్యాక్టరీ నిర్మాణం చివరిదశకు చేరుకుంది. 90పనులు పూర్తయ్యాయి. ఎలక్ట్రికల్ ఇంజన్లు నడిపించేందుకు ఎలక్ట్రిక్ తీగల బిగింపుతోపాటు చిన్నచిన్న పనులు పూర్త
హనుమకొండ జిల్లా.కాజీపేట లో నిర్మిస్తున్న కోచ్ ఫ్యాక్టరీ పూర్తి


కాజీపేట , 24 ఫిబ్రవరి (హి.స.)

, హనుమకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్యపురం సమీపంలో నిర్మిస్తున్న కోచ్ఫ్యాక్టరీ నిర్మాణం చివరిదశకు చేరుకుంది. 90పనులు పూర్తయ్యాయి. ఎలక్ట్రికల్ ఇంజన్లు నడిపించేందుకు ఎలక్ట్రిక్ తీగల బిగింపుతోపాటు చిన్నచిన్న పనులు పూర్తయితే నిర్మాణం పూర్తయినట్లేనని రైల్వే అధికారులు అంటున్నారు.

శనివారం ఆర్వీఎన్ఎల్ అధికారులు, రైల్వే అధికారులు ఇంజన్తో ఉన్న కోచ్ను రైల్వే పట్టాల పైకి ఎక్కించి ట్రయల్ రన్ నిర్వహించారు. ఇది విజయవంతమైంది. దీంతో అధికారులు కోచ్ ఫ్యాక్టరీని మార్చి31 తర్వాత ప్రారంభించడానికి చర్యలు చేపడుతున్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఫ్యాక్టరీ ప్రాంభోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మామునూరు ఎయిర్ఫోర్టు పనులకు శంకుస్థాపన, టెక్స్టైల్ పార్క్ పనులు, కాజీపేట కోచ్ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం ఒకేసారి జరిగే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. కాగా, కాజీపేట కోచ్ఫ్యాక్టరీ చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్) పర్యవేక్షణలో రైలు బోగీలను తయారీ చేస్తుందని అధికారులు చెబుతున్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande