దేవాదుల సాక్షిగా మాకు పరిష్కారమే కావాలి.. సీఎం రేవంత్ రెడ్డి సెన్సేషనల్ ట్వీట్
హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.) తెలుగు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా నెలకొన్న కృష్ణా, గోదావరి జలాల పంపిణీ అంశాలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. జల సాధనలో ఘర్షణల కంటే చర్చల ద్వారానే శాశ్వత పరిష్కారాలు సాధ్యమని, ప్రజా ప్రయోజనాలే పరమావధిగా అడుగులు వేయాల్స
సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.)

తెలుగు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా

నెలకొన్న కృష్ణా, గోదావరి జలాల పంపిణీ అంశాలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. జల సాధనలో ఘర్షణల కంటే చర్చల ద్వారానే శాశ్వత పరిష్కారాలు సాధ్యమని, ప్రజా ప్రయోజనాలే పరమావధిగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని పలువురు మేధావులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy) 'X' () వేదికగా ట్వీట్ చేశారు. దేవాదుల (Devadula) సాక్షిగా కృష్ణా, గోదావరి జలాల సాధనలో వివాదమా, పరిష్కారమా అంటే తాము పరిష్కారం కోరుకుంటామని అన్నారు. చర్చలా, పంచాయితీనా అంటే తాము చర్చలే కోరుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడికి తాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు అందివ్వడమే తమ ప్రభుత్వం మందున్న టార్గెట్ అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

రాజీలేని పోరాటం చేస్తాం.. సీఎం రేవంత్

ఇటీవల దేవాదుల ప్రాజెక్టు సందర్శన సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా (Krishna), గోదావరి (Godavari) నదుల నీటి వాటా విషయంలో రాష్ట్రాల మధ్య తలెత్తే అభిప్రాయ భేదాలను పంచాయితీల ద్వారా కాకుండా, స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించుకుంటామని అన్నారు. జలాల సాధనలో రాజీలేని పోరాటం చేస్తూనే, సామరస్యానికి పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు.

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఇలా..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు ప్రధానంగా కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీ చుట్టూనే తిరుగుతున్నాయి. విభజన చట్టం ప్రకారం తాత్కాలికంగా ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను కేటాయించారు. అయితే, తమకు సమాన వాటా కావాలని తెలంగాణ మొదటి నుంచీ డిమాండ్ చేస్తోంది. కృష్ణా జలాల వివాదాల పరిష్కారానికి (KWDT-II) బృజేష్ కుమార్ నేతృత్వంలోని ట్రైబ్యునల్ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయాలని తెలంగాణ కోరుతోంది. ఇక శ్రీశైలం (Srisailam), నాగార్జున సాగర్ డ్యామ్ల నిర్వహణ ఎవరి పరిధిలోకి రావాలనే దానిపై తరచుగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఇటీవల కేంద్రం వీటిని KRMB పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించింది.

అదేవిధంగా గోదావరిలో నీటి లభ్యత ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రాజెక్టుల నిర్మాణంపై అభ్యంతరాలు ఉన్నాయి. తెలంగాణ నిర్మిస్తున్న కాళేశ్వరం (Kaleshwaram) వంటి ప్రాజెక్టుల వల్ల తమకు వచ్చే నీటి ప్రవాహం తగ్గుతుందని ఏపీ, అలాగే ఏపీ చేపట్టిన పోలవరం ఎత్తు, ముంపు ప్రభావంపై తెలంగాణ ఇలా పరస్పరం అభ్యంతరాలు లేవనెత్తుతున్నాయి. తాజాగా, ఏపీ ప్రభుత్వం తలపెట్టిన పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టుపై కూడా తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలశక్తికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్కు ఏపీ ప్రభుత్వం స్పందింస్తుందో లేదో వేచి చూడాల్సిందే మరి.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande