
కొత్తగూడెం, 24 ఫిబ్రవరి (హి.స.)
సింగరేణి కాలరీస్ సంస్థ మెడికల్
ఇన్వాలిడేషన్ విధానాలలో జరిగిన అవకతవకలపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ డీజీపీకి ఫిర్యాదు అందింది. సింగరేణి సంస్థ మెడికల్ ఇన్వాలిడేషన్ లో అతిపెద్ద కుంభకోణం జరిగిందని కొత్తగూడెం రామవరం కు చెందిన అన్నబోయిన రాజేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర ఏసీబీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. మాజీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎం. శ్రీనివాసరావు, నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల నుండి స్పెషలిస్ట్ వైద్యులు కుమ్మక్కయి ఉద్యోగులను వైద్యపరంగా అనర్హులుగా ప్రకటించారని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుడు ఫిర్యాదులో
మార్చి 9, 2018 నుండి సుప్రీంకోర్టు, హైకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించి 18000 మంది ఉద్యోగులను మెడికల్ ఇన్వాలిడ్ గా ప్రకటించారని ఫిర్యాదులో తెలిపారు. ఇది అతి పెద్ద స్కామ్ అని దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఏసీబీ అధికారులను కోరారు. ఈ ఫిర్యాదు కాపీని ఏసీబీ డీజీపీతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి, ఇంధన కార్యదర్శి కి రిజిస్టర్ పోస్టు ద్వారా సమర్పించినట్లు ఫిర్యాదుదారుడు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..