లడ్డూ కల్తీలో కుట్ర కోణం: అసెంబ్లీలో లెక్కల చిట్టాను విప్పిన చంద్రబాబు
అమరావతి , 24 ఫిబ్రవరి (హి.స.) తిరుమల లడ్డు కల్తీలో కుట్ర కోణం ఉందని సీఎం చంద్రబాబు నాయుడ అన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లలో ఆయన మాట్లాడుతూ గత పాలకుల వల్ల జరిగిన లడ్డూ కల్తీపై ప్రతి భక్తుడు ఆవేదన వ్యక్తం చేశారని సీఎం చ
అసెంబ్లీ


అమరావతి , 24 ఫిబ్రవరి (హి.స.)

తిరుమల లడ్డు కల్తీలో కుట్ర కోణం ఉందని సీఎం చంద్రబాబు నాయుడ అన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లలో ఆయన మాట్లాడుతూ గత పాలకుల వల్ల జరిగిన లడ్డూ కల్తీపై ప్రతి భక్తుడు ఆవేదన వ్యక్తం చేశారని సీఎం చంద్రబాబు తెలిపారు. జగన్(Jagan) ప్రభుత్వంలో ఆలయాలపై దాడులు జరిగినా పట్టించుకోలేదని ఆయన గుర్తు చేశారు. వైసీపీ గవర్నమెంట్లో ప్రతి ఒక్కరూ బాధితులేనని వ్యాఖ్యానించారు. 2024లో ముఖ్యమంత్రి అయిన వెంటనే తిరుమల తిరుమల దేవస్థానం(Tirumala Tirumala Temple) ప్రక్షళనపై ఫోకస్ పెట్టామని చెప్పారు. తన వద్దకు వచ్చిన ఎన్డీడీబీ రిపోర్టు వివరాలు వెల్లడించానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. బ్రిటిష్ పాలకులు సైతం తిరుమల జోలికి వెళ్లలేదని గుర్తు చేశారు. వెంకటేశ్వరస్వామి తనకు పునర్జన్మ ఇచ్చారని తెలిపారు. 59. 71 లక్షల కేజీల కల్తీ నెయ్యిని లడ్డూ వినియోగం కోసం వాడారన్నారు. ఇందుకోసం రూ. 234.51 కోట్లు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. లడ్డూ కల్తీ ఘటనపై సీబీఐ సిట్ ఏర్పాటు చేశామన్నారు. సీబీఐ సిట్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసిందని చంద్రబాబు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande