ఇకనైనా ఒప్పుకోండి: అసెంబ్లీ వేదికగా పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
అమరావతి, 24 ఫిబ్రవరి (హి.స.) తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్ హయాంలో లడ్డూ నాణ్యతగా లేదనే ఆరోపణలు వచ్చాయని గుర్తుచేశారు. లడ్డూపై కల్తీపై ముఖ్యమంత్రి మాట్లాడిన సమయంలోనే ఎల
పవన్ కల్యాణ్


అమరావతి, 24 ఫిబ్రవరి (హి.స.)

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్ హయాంలో లడ్డూ నాణ్యతగా లేదనే ఆరోపణలు వచ్చాయని గుర్తుచేశారు. లడ్డూపై కల్తీపై ముఖ్యమంత్రి మాట్లాడిన సమయంలోనే ఎలా ముందుకు వెళ్లాలనే ఆలోచన చేశామని చెప్పారు. వైసీపీ గవర్నర్మెంట్ లడ్డూ కల్తీకి పాల్పడిందని ఆయన ఆరోపించారు. తిరుమల(Tiలో తప్పు జరగడం వల్లే తాను దీక్ష చేశానని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. నెయ్యి తయారీ కోసం పాలను వియోగించలేదని, అలాంటి సంస్థలకు టెండర్లు అప్పగించారని మండిపడ్డారు. గత పాలకులు రసాయనాల నుంచి నెయ్యి తయారు చేయొచ్చని నిరూపించారని వ్యాఖ్యానించారు. ‘‘కల్తీ జరిగిందని ఒప్పుకుని ఉంటే ఇంత రచ్చ అయ్యేది కాదన్నారు. వాళ్లకు నచ్చిన సంస్థలకు టెండర్లు కట్టబెట్టేందుకు నిబంధనలు మార్చారన్నారు. నిందితులపై గత పాలకులు చర్యలు తీసుకోలేదు. నిబంధనలు మార్చి నచ్చిన సంస్థలకు టెండర్లు కట్టబెట్టారు.’’ అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande