శాసనమండలి నుంచి వైసీపీ వాకౌట్.. ప్రభుత్వంపై బొత్స ఫైర్
అమరావతి, 24 ఫిబ్రవరి (హి.స.) రాజమండ్రి కల్తీ పాల ఘటన(Rajahmundry adulterated milk incident)పై శాసనమండలి దద్దరిల్లింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. నలుగురు మరణాలకు ప్రభుత్వమే కారణమని వైసీపీ సభ్యులు ఫైర్ అయ్యారు. ఇందుకు టీడీప
శాసనమండలి సమావేశాలు


అమరావతి, 24 ఫిబ్రవరి (హి.స.)

రాజమండ్రి కల్తీ పాల ఘటన(Rajahmundry adulterated milk incident)పై శాసనమండలి దద్దరిల్లింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. నలుగురు మరణాలకు ప్రభుత్వమే కారణమని వైసీపీ సభ్యులు ఫైర్ అయ్యారు. ఇందుకు టీడీపీ సభ్యులు సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీంతో వైసీపీ(Ycp) సభ్యులు వాకౌట్ అయ్యారు. అనంతరం ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పాలు కల్తీ జరిగి మనుషులు చనిపోవడమేంటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం గ్రామ స్థాయి నుంచి ఫెయిల్ అయిందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో అన్ని చోట్ల అవినీతి రాజ్య మేలుతోందన్నారు. కల్తీ పాల ఘటనపై శాసనమండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సభ సజావుగా జరగాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. అందుకే తాము శాసనమండలి నుంచి వాకౌట్ అయ్యామని చెప్పారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు, దాడులు, వేధింపులు ఎక్కువయ్యాయని బొత్స మండిపడ్డారు

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande