తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వారికి దర్శనానికి 18గంటలు
తిరుమల, 24 ఫిబ్రవరి (హి.స.) గత కొద్దిరోజులుగా తిరుమలలో భక్తల రద్దీ తగ్గడంలేదు. నేడు సైతం భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం కోసం భక్తులకు 18 గంటల సమయం పడుతోంది. 300 రూ..శీఘ్రదర్శనానికి 2
తిరుమ‌ల‌


తిరుమల, 24 ఫిబ్రవరి (హి.స.) గత కొద్దిరోజులుగా తిరుమలలో భక్తల రద్దీ తగ్గడంలేదు. నేడు సైతం భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం కోసం భక్తులకు 18 గంటల సమయం పడుతోంది. 300 రూ..శీఘ్రదర్శనానికి 2 నుండి 3 గంటల సమయం పడుతోంది. సర్వ దర్శనం టోకెన్ పొందిన భక్తులకు 3 నుండి 5 గంటల సమయం పడుతోంది. సోమవారం 77,803 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 27,766 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామి వారి హుండీ ఆదాయం రూ.4.66 కోట్లు వచ్చింది.

ఫిబ్రవరి 28 నుండి వార్సిక బ్రహ్మోత్సవాలు

ఫిబ్రవరి 28వ తేదీ నుండి మార్చి 4 వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 24వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉండనుంది. అదే విధంగా మార్చి 01న ధ్వజారోహణం ఉంటుంది. ఇక 26వ తేదీ నుండి ఐదు రోజుల పాటు పుష్కరిణిలో తెప్పోత్సవాలు జరగనున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande