
మంత్రాలయం,, 25 ఫిబ్రవరి (హి.స.)
కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠానికి ఓ భక్తుడు 50 కిలోల వెండి శేష వాహనం, సుమారు రూ.కోటిన్నర నవరత్న కవచాన్ని బహూకరించినట్టు పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు, మఠం అధికారులు తెలిపారు. బెంగళూరుకు చెందిన సంపత్ కుమార్ శెట్టి అనే భక్తుడు.. మూలరాములుకు రజత శేష వాహనం, పూర్వ పీఠాధిపతి సుజయీంద్రతీర్థుల బృందావనానికి నవరత్న కవచాన్ని బహూకరించినట్టు వెల్లడించారు.
నవరత్న కవచాన్ని సుజయీంద్ర తీర్థుల బృందావనానికి అలంకరించి పీఠాధిపతి హారతులు ఇచ్చారు. రాఘవేంద్ర స్వామి మెమెంటో, శేషవస్త్రం, ఫల, పుష్ప, మంత్రాక్షితలు, పరిమళ ప్రసాదం ఇచ్చి భక్తుడి కుటుంబాన్ని ఆశీర్వదించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ