
అమరావతి, 25 ఫిబ్రవరి (హి.స.):ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. బుధవారం తొమ్మిదో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు తొలుత ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానుంది. ఎమ్మిగనూరులో న్యాయస్థానం, నెల్లిమర్లలో విద్యుత్ సరఫరా సమస్యలు, రాజీవ్ గృహకల్ప, వాంబే కాలనీలోని ఇళ్లకు మరమ్మతులతోపాటు తోటపల్లి - మద్దువలస కాలువ పనులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు, వసతి గృహాలలో కలుషిత ఆహార ఘటనలు, అనంతపురంలో టెక్సటైల్ పార్క్, వశిష్ట గోదావరిపై పిచ్చింగ్ ప్లాట్ఫామ్ నిర్మాణం, యువత కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, మైనర్ బాలికల మిస్సింగ్ కేసులుపై నేడు సభ్యులు ప్రశ్నలు వేయనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ