మార్కాపురం లో సీఎం చంద్రబాబు.బహిరంగ సభ
అమరావతి, 25 ఫిబ్రవరి (హి.స.) మార్కాపురంలో సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న విద్యుత్తుశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి,ముత్తుముల అశోక్రెడ్డి, తదితరులు మార్కాపురం కేంద్రం ఆవిర్భంంచిన కొత
మార్కాపురం లో సీఎం  చంద్రబాబు.బహిరంగ సభ


అమరావతి, 25 ఫిబ్రవరి (హి.స.)

మార్కాపురంలో సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న విద్యుత్తుశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, మార్కాపురం,

గిద్దలూరు ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి,ముత్తుముల అశోక్రెడ్డి, తదితరులు

మార్కాపురం కేంద్రం ఆవిర్భంంచిన కొత్త జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తొలిసారిగా బుధవారం పర్యటించనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లాకు ప్రత్యేక నిధులతోపాటు వరాల జల్లు కురిపిస్తారని జిల్లా ప్రజలు ఆశగా ఎదరు చూస్తున్నారు. తొలుత పెద్దదోర్నాల మండలం కొత్తూరు వద్ద సొరంగాలను సీఎం పరిశీలిస్తారు. అనంతరం గంటవానిపల్లె గ్రామసమీపంలో రూ.450 కోట్లతో చేపట్టనున్న వెలిగొండ ప్రాజెక్టు ఫీడరు కాలువ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 2.15 గంటల మార్కాపురం చేరుకుని మార్కాపురం- తర్లుపాడు రహదారిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

అనంతరం తిరిగి సాయంత్రం 4.40 గంటలకు హెలీకాప్టరులో ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. పర్యటనలో భాగంగా జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. పెద్దదోర్నాల మండలం గంటవానిపల్లె సమీపంలోని ఫీడర్ కాలువ, బహిరంగ సభ వద్ద ఏర్పాట్లను మంగళవారం ఇన్ఛార్జి కలెక్టర్ రాజా బాబు, గిద్దలూరు, కనిగిరి ఎమ్మెల్యేలు ముత్తమల అశోక్రెడ్డి, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, తెదేపా వైపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్బాబు, ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, వెలిగొండ ప్రాజెక్టు సీఈ రమేష్, ఎస్ఈ అబూతాలీం, జేసీ కల్పనాకుమారి, కందుకూరు సబ్కలెక్టర్ హిమవంశీ తదితరులు పరిశీలించారు. బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాజీ మంత్రులు దేవినేని ఉమ, ఉండవల్లి శ్రీదేవి, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, కందుల నారాయణరెడ్డి, ముత్తుముల అశోక్రెడ్డితో కలిసి పరిశీలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande