జిహెచ్ఎంసి దోమల ఫాగింగ్ లో భారీ స్కాం ...!
హైదరాబాద్, 25 ఫిబ్రవరి (హి.స.) జిహెచ్ఎంసి దోమల నివారణకు ఫాగింగ్ చేసే వ్యవహారంలో భారీగా అవినీతి జరిగినట్లుగా తెలుస్తోంది. ఫాగింగ్ చేసే సిబ్బంది మధ్య పంపకాల్లో తేడాలు రావడంతో ఈ విషయం బయటపడింది. ప్రతి ఏటా దోమల నియంత్రణకు రాష్ట్ర ప్రుత్వం రూ32 కోట్లు
GHMC


హైదరాబాద్, 25 ఫిబ్రవరి (హి.స.) జిహెచ్ఎంసి దోమల నివారణకు ఫాగింగ్ చేసే వ్యవహారంలో భారీగా అవినీతి జరిగినట్లుగా తెలుస్తోంది. ఫాగింగ్ చేసే సిబ్బంది మధ్య పంపకాల్లో తేడాలు రావడంతో ఈ విషయం బయటపడింది.

ప్రతి ఏటా దోమల నియంత్రణకు రాష్ట్ర ప్రుత్వం రూ32 కోట్లు ఖర్చు చేస్తోంది. బల్దియా ఉన్నతాధికారుల దోమల ఫాగింగ్ కోసం మల్కాజిగిరి సర్కిల్కు రోజూ 84 లీటర్ల డీజిల్ కేటాయించారు. అయితే ఎంటమాలజీ సిబ్బంది 84 లీటర్లలో కేవలం 24 లీటర్ల డీజిల్ దోమల ఫాగింగ్ చేసి.. మిగతా డీజిల్ను పక్కదారి పట్టించారు. ఆ డీజిల్ను పెట్రోల్ బంక్కు రూ.10 కమీషన్ ద్వారా అమ్మి.. మిగతా డబ్బును తీసుకున్నారు. అలా వచ్చిన సొమ్ములో ఫాగింగ్ చేసే సిబ్బందికి ప్రతి నెల రూ.5 వేలు ఇచ్చి, మిగతా డబ్బులను సూపర్వైజర్, ఏఈ, ఎస్ఈ పంచుకునేవారు. పంపకాల్లో తేడా రావడంతో ఫాగింగ్ చేసే సిబ్బంది ఈ విషయాన్ని బయటపెట్టారు. దీంతో ఆ వర్కర్ను ఇతర సిబ్బంది, ఎంటమాలజీ అధికారులు బెదిరించారు.

ఇదిలా ఉంటే ఎంటమాలజీలో డీజిల్ పక్కదారి పడుతుందున్న విషయం బయటకు రావడంతో.. గత మూడు నెలల నుంచి డీజిల్లో మెలాథిన్ అనే కెమికల్ను కలిపి ఇస్తున్నారు. దీంతో డీజిల్ను అమ్ముకునే ఛాన్స్ లేకుండా పోయింది. అయినప్పటికీ ఫాగింగ్ పని తప్పించుకోవడానికి ఆ డీజిల్ను సిబ్బంది డ్రైనేజీలో పారబోస్తున్నారు. ఇలా నిధులు పక్కదారి పట్టడంతో పాటు, సిబ్బంది సరిగ్గా పనిచేకపోవడంతో నగరవాసులకు దోమల బెడద తప్పడం లేదు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande