రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రక్షాళనకు రంగం సిద్ధం
తెలంగాణ, 25 ఫిబ్రవరి (హి.స.) రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)ను ఏప్రిల్ నుంచి తెలంగాణలోనూ చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో సరైన ఆధారా
Sir


తెలంగాణ, 25 ఫిబ్రవరి (హి.స.) రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)ను ఏప్రిల్ నుంచి తెలంగాణలోనూ చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో సరైన ఆధారాలు చూపని పక్షంలో ఓటును తొలగించేలా కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు. ఇప్పటికే అధికారులు ముందస్తు ఏర్పాట్లు వేగవంతం చేస్తూ.. ఓటర్ల వివరాల సేకరణపై దృష్టి సారించారు. 2002లో రాష్ట్రంలో 2.20 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. తాజాగా ఆ సంఖ్య 3.40 కోట్లకు పెరిగింది. నాటికీ, నేటికీ 1.2 కోట్ల ఓటర్లు పెరిగినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో 2002 ఓటరు జాబితాను 2026 తాజా ఓటరు లిస్టుతో పోల్చి ప్రక్షాళన చేయనున్నారు. ఈ ప్రక్రియలో బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎలీ), బీఎల్ఎలు కీలక పాత్ర పోషించనున్నారు. వీరి ద్వారానే ఓటరు జాబితా మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగనున్నది.

ఇటీవల దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన ఎస్ఐఆర్ ఓటరు తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాల అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించింది. దీంతో రాష్ట్రంలోని కేంద్ర ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను వేగవంతం చేశారు. నాటి ఓటర్లు ఇప్పుడు అక్కడే ఉన్నారా? ఎక్కడికి వెళ్లారు? నియోజకవర్గంలో ఉన్నారా? మరొక నియోజకవర్గం, ఇతర జిల్లా, రాష్ట్రానికి మారారా? లేక చనిపోయారా? అనే వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు సుమారు 2 కోట్ల ఓటర్ల మ్యాపింగ్ పూర్తయిందని అధికారులు తెలిపారు. మరో 1.4 కోట్ల అదే 3

ప్రస్తుతం జిల్లా సహాయ ఎన్నికల నమోదు అధికారులకు (ఏఈఆర్డీలు) ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇస్తున్నారు. ఓటరు జాబితాల తయారీ, నవీకరణ, నిర్వహణపై అవగాహన కల్పిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరు జాబితాలో చేర్చడం, అనర్హుల పేర్లను తొలగించడం, వివరాల సవరణ వంటి అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇస్తున్నారు. హైదరాబాద్లోని ఓటరు జాబితాలో లక్షల మంది చనిపోయిన వారి పేర్లు ఉన్నట్టు గుర్తించారు. అంతేకాకుండా ఎవరైనా రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉంటే.. ఒక చోట తొలగించి.. ఏదైనా ఒకేచోట తమ ఓటు హక్కును కొనసాగించుకునేలా ఆప్షన్ ఇవ్వనున్నారు. ఇలా ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఓటు ఉన్న వారి ఆప్షన్స్ అడిగి తెలుసుకుని కొనసాగించనున్నారు. ఎన్నికల సంఘం పేర్కొన్న ఆధారాలు ఉంటేనే ఓటు హక్కును కొనసాగిస్తారు. దేశ పౌరుడిగా రుజువు చేసుకునే ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, కుటుంబ సభ్యుల వివరాలు, ఇతర డాక్యుమెంట్స్ తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది.

రాష్ట్రంలోని దాదాపుగా 45 శాతానికి పైగా జనాభా పట్టణాల్లో నివసిస్తున్నది. ఈ నేపథ్యంలో 'సర్'ను నిర్వహించడం అధికారులకు పెద్ద సవాల్గా మారింది. పట్టణాల్లో అపార్ట్ మెంట్ వాసులు, ఐటీ ఉద్యోగులు, ఉన్నత ఉద్యోగులు, వ్యాపారులు, కూలీలు, ఇలా రకారకాల వారున్నారు. వారు ఉదయాన్నే విధులకు వెళ్లడం, ఎన్నికల వ్యవస్థ పట్ల కొంత వ్యతిరేకత ఉండటం, ఓటరు జాబితాపై అనాసక్తి తదితర కారణాల చేత సమాచార సేకరణ ఎస్ఐఆర్ అధికారులకు కత్తిమీద సాములాంటిదేనని చెబుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande