
తెలంగాణ, 25 ఫిబ్రవరి (హి.స.)
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో చెత్త పంచాయితీ చర్చనీయాంశంగా మారింది. నగరంలో ఇంటిం టి నుంచి చెత్తను సేకరించే స్వచ్ఛ ఆటోలను ప్రైవేటు సంస్థ 'రాంకీ' పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర దుమారం రేపుతోంది. దీన్ని స్వచ్ఛ ఆటోల యజమానులు, కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో శానిటేషన్పై మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు సీరియస్గా తీసుకున్నారు. పారిశుధ్యంలో సమూల మార్పులు తీసుకురావాలని నిర్ణయించారు. స్వచ్ఛ ఆటోల యజమానులు, కార్మికులు, యూనియన్లతో ముగ్గురు కమిషనర్లు ఇటీవల సమావేశం నిర్వహించారు. ఎట్టి పరిస్థితిలో ఇంటింటి చెత్త సేకరణ జరగాల్సిందేనని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.
సీఎం నిర్ణయమే తరువాయి
హైదరాబాద్ మహానగరంలో పారిశుధ్య నిర్వహణపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, సీఎంసీ కమిషనర్ జి.సృజన, ఎం ఎంసీ కమిషనర్ ఎం. వినయ్ కృష్ణారెడ్డి స మావేశమై మూడు ప్రతిపాదనలు చేసినట్టు తెలిసింది.
రాంకీ ఒప్పందం ప్రకారం ఇం టింటి చెత్త సేకరణ, రవాణా, డంపింగ్ యా ర్డులో సైంటిఫిక్ డిస్పోజల్ చేస్తే మెట్రిక్ ట న్నుకు రూ.2,345 చెల్లించాలి. కానీ ఇం టింటి చెత్త సేకరణ మినహాయిస్తే 90 శా తం పనులను మాత్రమే రాంకీ నిర్వహిస్తోం ది. అయితే 'ఒప్పందం ప్రకారం రాంకీ సం స్థకే ఇంటింటి చెత్త సేకరణను సైతం ఇవ్వడంతోపాటు స్వచ్ఛ ఆటోలను సైతం రాంకీ పరిధిలోకి తీసుకురావాలి. యథావిధిగా స్వ చ్ఛ ఆటోల ద్వారానే ఇంటింటి చెత్తసేకరణ చేపట్టాలి. దీనికి టెక్నాలజీ ఆధారిత చర్యలు తీసుకోవాలి. ఈ రెండు చర్యలు కాకుండా.. థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా ఇంటింటి చెత్త సేక రణ చేయిస్తారా?' అనే మూడు రకాల ప్రతిపాదనలను ముగ్గురు కమిషనర్ల ఆధ్వర్యం లో ప్రభుత్వానికి పంపించినట్టు తెలిసింది. ఈ మూడింటిపై సీఎం రేవంత్ ఎదురుచూస్తున్నారు. తీసుకునే నిర్ణయం కోసం
ఒప్పందం ఇలా...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో చెత్త సేకరణ, రవాణా, జవహర్నగర్ డంపింగ్ యార్డు నిర్వహణ కోసం 2009లో రాంకీ సంస్థతో 25 ఏళ్లపాటు ఒప్పందం కుదుర్చుకుంది. ఇంటింటి చెత్త సేకరణ మినహాయిస్తే జీహెచ్ఎంసీతో రాంకీ కుదుర్చుకున్న ఒప్పందం అమలవుతోంది. మెట్రిక్ టన్నుకు 5.1800 చెల్లించాలని నిర్ణయించారు. అయితే మొదట్లో డంపింగ్ యార్డు, సైంటిఫిక్ డిస్పోజల్ 40 శాతం ఫీజు మాత్రమే ఇచ్చేవారు. కానీ క్రమంగా చెత్త రవాణా 20 శాతం, డంపింగ్ యార్డులో చెత్త నిల్వ, శాస్త్రీయ విధానంలో నిర్వహణకు 40 శాతం, రోడ్లపై ఉన్న చెత్తను సైతం తరలించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. దీనికి 30 శాతం మొత్తం 90 శాతం రాంకీ చేతికి వెళ్లిపోయింది. ప్రస్తుతం 100 శాతం చెత్త నిర్వహణకు మెట్రిక్ టన్నుకు రూ.2,345 ఇవ్వాల్సి ఉంటుంది. అయితే రాంకీ ద్వారా 90 శాతం పనులు చేస్తుండడంతో మెట్రిక్ టన్నుకు రూ.2,110 చెల్లిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు