తెలంగాణలో ఏం జరుగుతుందో రాహుల్ గాంధీ తెలుసుకోవాలి : ఈటల రాజేందర్
న్యూఢిల్లీ, 26 ఫిబ్రవరి (హి.స.) తెలంగాణలో ఏం జరుగుతుందో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలుసుకోవాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సూచించారు. సీఎం రేవంత్ దుర్మార్గాలను రాహుల్ గాంధీ ఆపాలని, లేదంటే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారని విమర్
ఎంపీ ఈటెల


న్యూఢిల్లీ, 26 ఫిబ్రవరి (హి.స.)

తెలంగాణలో ఏం జరుగుతుందో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలుసుకోవాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సూచించారు. సీఎం రేవంత్ దుర్మార్గాలను రాహుల్ గాంధీ ఆపాలని, లేదంటే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారని విమర్శించారు. గురువారం ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం పట్టుకుని తిరుగుతున్నారు.. కాంగ్రెస్ పాలన ఉన్న రాష్ట్రంలో మీరు చేస్తుంది ఏంటి? అని నిలదీశారు. ఖమ్మంలో ఇంటికో డీసీఎం పంపి కూలగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పెద్దలు వేల కోట్ల భూములు అక్రమించుకుంటే పట్టించుకోవడం లేదన్నారు. కూకట్పల్లి ఎల్లమ్మ బండ వద్ద 120 ఎకరాలు ప్రభుత్వ భూమి అక్రమించుకుంటే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పేదల ఇళ్లు మాత్రం కులగొడుతున్నారని మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన పేరుతో వందల ఇళ్లను ఖాళీ చేయడం, కూల్చడాన్ని ఖండించారు. మధు పార్క్ అపార్ట్ మెంట్లో నివసిస్తున్న ప్రజల ఆవేదన ప్రభుత్వానికి అర్థం కావడం లేదా? అని ప్రశ్నించారు.

కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా పేదలకు భూములు, ఇల్లు ఇవ్వకుండా ఉన్న ఇళ్లును కూలగొడుతున్నారని మండిపడ్డారు. ఖమ్మంలో పేదల ఇండ్లు కూలగొట్టడాన్ని ఖండించారు. ఇల్లు కోల్పోయిన పేదలకు తక్షణమే ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నష్టపరిహారం పేరుతో బుకాయిస్తే ఖబర్దార్.. అంటూ హెచ్చరించారు. కేంద్ర రక్షణ శాఖ ఇచ్చిన భూముల్లో గాంధీ పార్క్ కట్టుకోవాలని, కేంద్రం భూములు ఇచ్చినది అభివృద్ధికి..

పేదలను ఇబ్బంది పెట్టడానికి కాదన్నారు. ఫీజు రీ ఎంబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ మందులు, బకాయిలకు, డైట్ చార్జీలకు నిధులు లేవని చెప్పి రూ.5 వేల కోట్లు పెట్టి గాంధీ పార్క్ కడతామంటున్నారు.. ముందు అవి చేసి మీరు ఏమన్నా కట్టుకోండని సూచించారు. తెలంగాణలో పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande