ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు గుడ్ న్యూస్.. కేంద్ర ఎన్నికల కమిషనర్ కీలక ప్రకటన
న్యూఢిల్లీ, 27 ఫిబ్రవరి (హి.స.) ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం (ECI) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎం (EVM) ఓట్లకు, వీవీప్యాట్ (VVPAT) స్లిప్పులకు మధ్య ఉన్న సందేహాలను నివృత్తి చేసుకునేందుకు అభ్యర్థులకు మరో అవకాశం
Election commission


న్యూఢిల్లీ, 27 ఫిబ్రవరి (హి.స.)

ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను

పెంచే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం (ECI) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎం (EVM) ఓట్లకు, వీవీప్యాట్ (VVPAT) స్లిప్పులకు మధ్య ఉన్న సందేహాలను నివృత్తి చేసుకునేందుకు అభ్యర్థులకు మరో అవకాశం కల్పించింది. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్(Gnanesh Kumar) స్పష్టతనిచ్చారు. సాధారణంగా ఫలితాల వెల్లడితో ప్రక్రియ ముగిసిందని భావిస్తారు. కానీ, తాజా నిబంధనల ప్రకారం కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూడా అభ్యర్థులు ఈవీఎం-వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలని కోరే అవకాశాన్ని కల్పించబోతున్నారు. ఎన్నికల ఫలితాలు రోజుల వరకు ఈ అవకాశం వెలువడిన 7 అందుబాటులో ఉంటుందని సీఈసీ తెలిపారు. ఒకవేళ అభ్యర్థులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకునే అభ్యర్థులు ఎన్నికల సంఘం నిర్దేశించిన కొంత ఫీజును చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపులో ఏవైనా తేడాలు ఉన్నాయని భావించే అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశమని ఎన్నికల సంఘం పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande