
కోల్కత్త, 27 ఫిబ్రవరి (హి.స.)
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో
జనం ఇవాళ మధ్యాహ్నం భూకంపం సంభవించింది. కోల్కతాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బలమైన భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో భయాందోళనలకు గురయ్యారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లలో ఉన్న వారు, కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది రోడ్ల మీదకు పరుగులు తీశారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.9గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో ఉన్నట్లుగా ప్రాథమికం తెలుస్తోంది. కోల్కతాతో పాటు పశ్చిమ బెంగాల్లో లోని సరిహద్దు జిల్లాల్లో కూడా భూమి కంపించినట్లుగా నివేదికలు అందుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఎక్కడా ప్రాణ నష్టం లేదా భారీ ఆస్తి నష్టం ప్రకటన వెలువడలేదు. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..