ప్రధాని మోదీ ఇన్స్టా @ 10 కోట్లు
దిల్లీ: , 27 ఫిబ్రవరి (హి.స.)సామాజిక మాధ్యమాల్లో ప్రధాని మోదీ హవా కొనసాగుతోంది. తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఆయన ఫాలోవర్ల సంఖ్య 10 కోట్లను మించింది. దీంతో ఇన్స్టాలో అత్యధిక మంది అనుసరిస్తున్న ప్రపంచ నేతగా ఆయన రికార్డు సృష్టించినట్లు అధికారులు గురువారం ప్
PM Modi


దిల్లీ: , 27 ఫిబ్రవరి (హి.స.)సామాజిక మాధ్యమాల్లో ప్రధాని మోదీ హవా కొనసాగుతోంది. తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఆయన ఫాలోవర్ల సంఖ్య 10 కోట్లను మించింది. దీంతో ఇన్స్టాలో అత్యధిక మంది అనుసరిస్తున్న ప్రపంచ నేతగా ఆయన రికార్డు సృష్టించినట్లు అధికారులు గురువారం ప్రకటించారు. 2014 నుంచి మోదీ ఇన్స్టాగ్రామ్ ఖాతాను వినియోగిస్తున్నారు. మరో సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఇప్పటికే ఆయనను అనుసరించే వారి సంఖ్య 10 కోట్లు దాటింది. కాగా.. ఇన్స్టాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే.. మోదీ ఫాలోవర్ల సంఖ్య రెండు రెట్లు ఎక్కువ. 4.3 కోట్ల మంది ఫాలోవర్లతో ట్రంప్ రెండో స్థానంలో ఉన్నారు. ట్రంప్ సహా ఆ తర్వాతి 4 స్థానాల్లో ఉన్న ఇండోనేసియా, బ్రెజిల్, తుర్కియే, అర్జెంటీనా అధ్యక్షుల ఇన్స్టా ఫాలోవర్ల సంఖ్య మొత్తం కలిపినా మోదీ ఫాలోవర్ల సంఖ్య కంటే తక్కువగానే ఉంటుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande