
డిల్లీ, 27 ఫిబ్రవరి (హి.స.)
అంతర్జాతీయ పరిస్థితులు, అమెరికా
. అధ్యక్షుడు ట్రంప్ తీరు స్టాక్ మార్కెట్ల (Stock markets)పై తీవ్రంగా చూపింది. ఈ రోజు ఉదయం నుంచి ప్రతికూల వాతావరణం ఎదుర్కొన్న భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ సుమారు 900 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్ల మేర పతనం కావడానికి ఈ అంతర్జాతీయ పరిణామాలు కారణమయ్యాయి. (International developments) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్ విధింపుల హెచ్చరికలు, అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగించాయి. దీనికి తోడు, ముడి చమురు ధరలు బ్యారెల్కు 72 డాలర్లకు చేరడం, అమెరికా డాలర్ బలపడటం వంటి అంశాలు భారత రూపాయి పై ఒత్తిడి పెంచి, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (Flls) నిధులను వెనక్కి తీసుకోవడానికి దారితీశాయి.
అలాగే ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల తలెత్తే అంతరాయాలపై భయాలు ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. ఆంత్రోపిక్ వంటి కంపెనీలు కొత్త ఏఐ టూల్స్ విడుదల చేయడంతో, సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ కోతలపై ఆందోళన మొదలైంది. ఇది కాకుండా, క్యూ3 (Q3) జీడీపీ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో దేశీయంగా కూడా కొంత అస్థిరత చోటుచేసుకుంది. బ్యాంకింగ్, ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాల్లో భారీగా లాభాల స్వీకరణ (Profit Booking) జరగడం వల్ల మార్కెట్లు కోలుకోలేకపోయాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..