
చతిస్గడ్, 26 ఫిబ్రవరి (హి.స.)
ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఇంద్రావతి
ప్రాంతంలో బలగాలకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలి నుంచి మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన జంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రావతి నది ప్రాంతంలో జరిగిందని జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు