అమెరికాను ఎదురించి మరీ, ఇండియాకు ఇజ్రాయెల్ భారీ సాయం!
హైదరాబాద్, 26 ఫిబ్రవరి (హి.స.) ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు. వరుసగా విదేశాల్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ నిన్న ఇజ్రాయెల్ లో అడుగుపెట్టారు. రెండు రోజుల పాటు ఇజ్రాయెల్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తారు.
మోదీ


హైదరాబాద్, 26 ఫిబ్రవరి (హి.స.)

ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం విదేశీ

పర్యటనలో బిజీగా ఉన్నారు. వరుసగా విదేశాల్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ నిన్న ఇజ్రాయెల్ లో అడుగుపెట్టారు. రెండు రోజుల పాటు ఇజ్రాయెల్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తారు. అయితే, నిన్న ఇజ్రాయెల్ లో అడుగుపెట్టిన ప్రధాని నరేంద్ర మోడీకి అరుదైన గౌరవం దక్కింది. ఇజ్రాయెల్ పార్లమెంట్ ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు.

ఈ నేపథ్యంలోనే ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ రికార్డు సృష్టించాడు. ఇక అంతకుముందు ఇజ్రాయెల్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, రక్షణ, అంతరిక్షం, ఉగ్రవాదం పై పోరు అంశాల నేపథ్యంలో ఇజ్రాయెల్ కు వెళ్లారు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే ఈ సందర్భంగా గతంలో ఇండియాకు ఇజ్రాయెల్ చేసిన సహాయం.. వాళ్లు చేసిన ధైర్య సాహసాలు వైరల్ గా మారాయి.

మొదటి నుంచి ఇండియాకు అండగానే నిలుస్తోంది. ఇజ్రాయెల్. 1971 సంవత్సరంలో అమెరికాను ఎదిరించి మరి ఇండియాకు రహస్యంగా ఆయుధాలు, ట్రైనింగ్ అందించింది ఇజ్రాయెల్ దేశం. అలాగే 1980లో పాక్ అణు కేంద్రాన్ని ధ్వంసం చేసేందుకు కూడా ఇండియాకు ఆఫర్ ఇచ్చింది. మొన్నటి ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఇండియాకు మద్దతు తెలిపింది ఇజ్రాయెల్. ఐక్యరాజ్యసమితిలో వాషింగ్టన్ కంటే ఢిల్లీనే ఎక్కువగా నమ్ముతానని బెంజిమిన్ నెతన్యాహు ప్రకటన చేశారు. వ్యవసాయం, రక్షణ, అంతరిక్షం వివిధ రంగాల్లో రెండు దేశాల మధ్య సహాయ సంబంధాలు మరింతగా మెరుగుపడనున్నట్టు చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande