వైరల్గా మారిన సారా నెతన్యాహు-మోడీ దుస్తులు.
ఢిల్లీ,26ఫిబ్రవరి (హి.స.) ప్రధాని మోడీ ఇజ్రాయెల్లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన కోసం మోడీ బుధవారం ఇజ్రాయెల్ వెళ్లారు. టెల్ అవీవ్లో మోడీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దంపతులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నెతన్యాహు భార్య సారా దుస్తులు-మోడీ
వైరల్గా మారిన సారా నెతన్యాహు-మోడీ దుస్తులు.


ఢిల్లీ,26ఫిబ్రవరి (హి.స.) ప్రధాని మోడీ ఇజ్రాయెల్లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన కోసం మోడీ బుధవారం ఇజ్రాయెల్ వెళ్లారు. టెల్ అవీవ్లో మోడీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దంపతులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నెతన్యాహు భార్య సారా దుస్తులు-మోడీ పాకెట్ స్క్వేర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సారా నారింజ రంగు (కుంకుమ పువ్వు) దుస్తులు ధరించారు. మోడీ పాకెట్ స్క్వేర్ కూడా అదే కలర్లో ఉండడంతో నెతన్యాహు ప్రత్యేకంగా వేలు పెట్టి చూపిస్తూ ఇద్దరి కలర్లు ఒకేలా ఉన్నాయని చూపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

‘‘మిమ్మల్ని చూడటం ఆనందంగా ఉంది’’ అని ప్రధాని మోడీతో నెతన్యాహు అన్నారు. మోడీ కూడా అంతే వేగంగా హృదయపూర్వకంగా పలకరించారు. మోడీ సాంప్రదాయ తెల్లటి కుర్తా, పైజామా ధరించి.. స్లీవ్లెస్ జాకెట్ ధరించారు. పాకెట్లో కాషాయ చతురస్రాన్ని ధరించారు. అలాగే నెతన్యాహు భార్య కూడా అదే రంగులో ఉన్న దుస్తులు ధరించింది. దీన్ని గమనించిన నెతన్యాహు ఇద్దరికి ఒకే పోలికగా ఉన్నాయని చూపించారు. ‘‘ఆమె ఏం వేసుకుందో చూశారా?’’ అని నెతన్యాహు.. ప్రధాని మోడీ పాకెట్ స్క్వేర్ వైపు.. భార్య దుస్తుల వైపు చూపించారు. ప్రధాని మోడీ వెంటనే ఆ విషయాన్ని గ్రహించి.. ‘‘అవును.. కాషాయం’’ అని నవ్వుతూ సమాధానమిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande