
హైదరాబాద్, 27 ఫిబ్రవరి (హి.స.)
రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టుల
అక్రిడిటేషన్ కార్డుల గడువును మరో 2 నెలల పాటు పొడిగిస్తూ ఇవాళ సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు ఈనెల 28న ముగియాల్సి ఉంది. అయితే, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీల (DMAC) ఏర్పాటు ప్రక్రియ ఇంకా పెండింగ్లో ఉండటం, అలాగే SMAC / DMAC సమావేశాల నిర్వహణకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వర్కింగ్ జర్నలిస్టులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ప్రస్తుత కార్డుల గడువును మార్చి 1, 2026 నుంచి ఏప్రిల్ 30, 2026 వరకు అంటే 2 నెలల పాటు పొడిగించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, DMAC చైర్మన్లకు సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక లేఖ రాశారు. అందులో ప్రస్తుతం ఉన్న జిల్లా జర్నలిస్టు అక్రిడిటేషన్ కార్డుల గడువును ఏప్రిల్ నెలాఖరు వరకు అమలులో ఉండేలా చూడాలని ఆమె కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..