పాకిస్తాన్ – ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం.. సరిహద్దుకు ఇరువైపులా సైన్యం మధ్య భీకర పోరు
ఢిల్లీ, 27 ఫిబ్రవరి (హి.స.) పాకిస్తాన్ – ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. తాలిబన్లు – పాకిస్తాన్ సైన్యం మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. పాకిస్తాన్పై ఆఫ్ఘన్ తాలిబాన్లు సైనిక ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో 8 పాకిస్తాన్ పోస
Afghan–Pakistan border escalates, Taliban claim


ఢిల్లీ, 27 ఫిబ్రవరి (హి.స.)

పాకిస్తాన్ – ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. తాలిబన్లు – పాకిస్తాన్ సైన్యం మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. పాకిస్తాన్పై ఆఫ్ఘన్ తాలిబాన్లు సైనిక ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో 8 పాకిస్తాన్ పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లు తాలిబాన్లు ప్రకటించారు. ప్రస్తుతం.. పాక్-ఆఫ్ఘన్ బోర్డర్, డ్యూరాండ్ లైన్ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి.

పాకిస్తాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా ఆఫ్ఘన్ తాలిబాన్లు విరుచుకుపడుతున్నారు. ఇటీవల పాక్ చేసిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్ ఎటాక్కు దిగింది. పాక్-ఆఫ్ఘన్ మధ్య ఉన్న 2వేల 611 కిలోమీటర్ల సరిహద్దు వెంబడి ఇరువైపులా భీకర పోరు జరుగుతోంది. పాకిస్తాన్లోని ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే సామర్థ్యం తమకు ఉందని ఆఫ్ఘనిస్తాన్ హెచ్చరించింది. ఇటీవల పాక్ చేసిన వైమానిక దాడులతో ఆప్ఘనిస్తాన్లో 13మంది మరణించగా.. మదర్సాలు, ఇళ్లు పెద్ద ఎత్తున ధ్వంసమయ్యాయి. పాకిస్తాన్లో ఉగ్రదాడులకు ఆఫ్ఘనిస్తానే కారణమని ఆ దేశం ఆరోపిస్తుంటే.. వాటితో తమకు సంబంధం లేదని తాలిబాన్లు స్పష్టం చేస్తోంది.

వాస్తవానికి, పాకిస్తాన్ ఇటీవల జరిపిన వైమానిక దాడులకు ప్రతిస్పందనగా గురువారం ఆఫ్ఘన్ సైన్యం పాకిస్తాన్పై దాడి చేసింది. ఆఫ్ఘన్ సైన్యం 19 పాకిస్తాన్ సైనిక పోస్టులు, ఒక ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. ఆఫ్ఘన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ గురువారం రాత్రి ఒక పోస్ట్లో ఈ విషయాన్ని వెల్లడించారు. “పాకిస్తాన్ సైన్యం పదే పదే తిరుగుబాట్లు చేస్తోందని, దానికి ప్రతిస్పందనగా, డ్యూరాండ్ లైన్ వెంబడి పాకిస్తాన్ సైనిక స్థావరాలపై పెద్ద ఎత్తున దాడలు జరిగాయి” అని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande